రికార్డుల మోతతో భారత్‌కు తొలి పసిడి.. కామన్వెల్త్‌లో మీరాబాయి చాను గోల్డెన్ హ్యాట్రిక్!

గ్లాస్గో: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన సత్తా చాటింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి, భారత్ ఖాతాలో తొలి బంగారు పతకాన్ని నమోదు చేసింది. అంతేకాదు, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని అరుదైన ఘనతను అందుకుంది. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో విఫలమైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న మీరాబాయి 85 కేజీలు ఎత్తి కామన్వెల్త్‌తో పాటు గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కేజీలు ఎత్తి మరో గేమ్స్ రికార్డును తన పేరిట నమోదు చేసింది. మొత్తం...