మాట నిలబెట్టుకుంటూ అభివృద్ధి బాటలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

ప్రజల విశ్వాసమే బలం.. హామీల అమలే లక్ష్యం: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్... ఎన్నికల హామీల నుంచి అభివృద్ధి పనుల వరకు.. చిత్తూరులో వేగంగా సాగుతున్న కార్యక్రమాలు... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధే తన రాజకీయాల ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన బాధ్యతగా భావిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యాలు, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.నన్ను నమ్మి ప్రజలు ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా...