విద్యార్థుల ఐక్య ఉద్యమాలకు ఇది చారిత్రాత్మక విజయం – ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ
విద్యార్థుల పోరాట విజయమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మదనపల్లి, 2026 జూలై 25: నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు పొందాయని, చివరకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి మంత్రి రాజీనామా చేయాల్సి రావడం విద్యార్థుల ఐక్య పోరాట శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు....