రేణిగుంట అభివృద్ధిలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి
రేణిగుంట, జూలై 25 (రాజనీతి): రేణిగుంట మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ కుమార్ ను శనివారం పంచాయతీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.నందిపాటి చక్రపాణి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డా. నందిపాటి చక్రపాణి మాట్లాడుతూ రేణిగుంట మేజర్ గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యమున్న స్థానిక సంస్థల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే జంక్షన్, జాతీయ రహదారులు, పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలు, వేగంగా విస్తరిస్తున్న నివాస కాలనీలతో రేణిగుంట ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఇలాంటి ప్రాంతంలో ప్రజల అవసరాలు...