అవగాహనే ఆరోగ్యానికి అసలైన రక్షణ కవచం-చౌడేపల్లిలో విద్యార్థులకు ఆరోగ్య చైతన్యం
చౌడేపల్లి మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో డాక్టర్ మునా మేడమ్, ప్రధానోపాధ్యాయులు ఉమాశంకర్ అధ్యక్షతన క్షయముక్త భారత్ అభియాన్ (TBMBA), యాంటీ డెంగ్యూ మాసం, స్టాప్ డయేరియా కార్యక్రమం, అంటురాని వ్యాధులు (NCDs)పై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ విద్యార్థులకు వ్యాధుల నివారణ, పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణపై వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేసి, ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించి, ఆరోగ్య ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ గంగులమ్మ, ఏఎన్‌ఎమ్ మీనా, ఓఎస్ నుమాన్ తదితరులు పాల్గొన్నారు.