ప్రతి వార్డులో మౌలిక వసతులే లక్ష్యం.. ప్రజల మద్దతు కోరిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

చిత్తూరు అభివృద్ధికి వేగం.. రూ.30.80 లక్షల పనులకు ఎమ్మెల్యే గురజాల శ్రీకారం ... సిమెంట్ రోడ్లు–కాలువల ప్రారంభం.. తేనెబండలో అభివృద్ధి పనులకు ఊపు.... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని తేనెబండ ప్రాంతంలో రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను శనివారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ...