దస్తావేజు రైటర్ల ఆందోళనకు చింతల మద్దతు.....

పీలేరు, జూలై 25 (రాజనీతి): పీలేరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు రైటర్లు చేపట్టిన పెన్‌డౌన్ ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించడం వల్ల భూ రికార్డులు, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దస్తావేజు రైటర్ల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని జీవోను పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రిని కోరారు.