మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం... సిఐ జయచంద్ర

రేణిగుంట, జూలై 25 (రాజనీతి): గంజాయి, మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని సీఐ జయచంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిధిలోని పార్సల్ కార్యాలయాలు, ప్రైవేటు కొరియర్ కేంద్రాల్లో పోలీసు సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ పార్సల్, కొరియర్ సేవలను కొందరు నేరస్థులు గంజాయి, మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు ఉపయోగించే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి పార్సిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు బుకింగ్ సమయంలో...