NTAలో భారీ ప్రక్షాళన ఒక్కసారిగా 47 మంది అధికారులపై వేటు

న్యూఢిల్లీ 25-07-2026: జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA)లో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంపు, అవకతవకలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా 47 మంది అధికారులను సేవల నుంచి తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొందరిపై క్రమశిక్షణా, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. పేపర్ లీక్ వివాదాల తర్వాత కీలక నిర్ణయం ఇటీవలి కాలంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో NTA పనితీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేపట్టింది. ఈ నేపథ్యంలో సంస్థలో విస్తృత స్థాయి సంస్కరణలు అమలు చేయాలని...