పీలేరులో విజయవంతంగా 'కళ్యాణప్రాప్తిరస్తు' సినిమా ఆడిషన్ * ప్రతిభ గలవారికి అవకాశం కల్పించాలన్నదే ఉద్దేశం - హీరో రాయలసీమ భరత్

పీలేరు 25-07-2026: తెలుగులో 'కళ్యాణప్రాప్తిరస్తు' చిత్రం నిర్మాణంలో భాగంగా నూతన నటీనటుల ఎంపిక (ఆడిషన్స్) కార్యక్రమాన్ని పీలేరులో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక తిరుపతి రోడ్డులోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఆడిషన్స్‌కు యువతీ యువకులు, బాల నటులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నటనా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి హాజరైన ఔత్సాహిక నటీనటుల అభినయం, హావభావాలు, సంభాషణ నైపుణ్యాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. స్థానిక ప్రతిభకు సినీ రంగంలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు చిత్ర కథానాయకుడు రాయలసీమ భరత్,...