మెగా పీటీఎం-4.0 విజయవంతం.. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల విరాళాలు

కలికిరి, జూలై 24: కలికిరి ఇందిరమ్మ కాలనీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం-4.0) విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, అభ్యాస ఫలితాలు, పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు తమ వంతు సహకారాన్ని అందించారు. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు వి.గంగరాజు రూ.5 వేల నగదు విరాళాన్ని, ఎన్. మధుసూదన్ రెడ్డి రూ.2 వేల నగదు విరాళాన్ని అందజేశారు. పి. ఖాదరవల్లి రూ.1,000 విలువైన క్రీడా సామగ్రి, నోట్‌బుక్స్, స్టేషనరీ వస్తువులను పాఠశాలకు అందించారు. వారి సేవాభావాన్ని ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు....