జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలి – రిజిస్ట్రేషన్ శాఖ సేవల ప్రైవేటీకరణను విరమించుకోవాలి – ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో జీవో నెం. 396 అమలు పేరుతో రిజిస్ట్రేషన్ సేవలను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) ద్వారా నిర్వహించే విధానాన్ని ముందుకు తీసుకురావడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రజల భూములు, ఇళ్లు, ఆస్తుల హక్కులకు సంబంధించిన అత్యంత కీలక ప్రభుత్వ శాఖ అని ఆయన పేర్కొన్నారు. ఈ శాఖలో ప్రభుత్వ బాధ్యతలను తగ్గించి ప్రైవేట్ సంస్థల పాత్రను పెంచే చర్యలు ప్రజా ప్రయోజనాలకు, ప్రభుత్వ వ్యవస్థకు అనుకూలం కాదని అన్నారు. ప్రభుత్వ సేవలను బలోపేతం చేయాలంటే ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, ఆధునిక...