అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పీలేరులో విద్యాసంస్థల బంద్ విజయవంతం

పీలేరు, జూలై 24: అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు, NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ ఆదేశాల మేరకు, నేడు పీలేరు పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NSUI జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ నాయకత్వం వహించారు. విద్యార్థి సంఘాల పిలుపునకు విద్యార్థులు, యువత విశేషంగా స్పందించడంతో పలు విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సాయి సంపత్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన NEET పరీక్షలో జరిగిన అక్రమాలు అత్యంత ఆందోళనకరమని అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని,...