ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే లక్ష్యం.. వెనక్కి తగ్గేది లేదన్న సీజేపీ

న్యూఢిల్లీ | 2026 జూలై 24 : దేశవ్యాప్తంగా పరీక్షల పారదర్శకత, విద్యా సంస్కరణలపై కొనసాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో సమావేశమై వారి ప్రధాన డిమాండ్లపై చర్చించారు. సమావేశంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల భద్రత, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మరికొంత సమయం కోరినట్లు ఉద్యమ నాయకులు తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు,...