ప్రేమకు మరో చిరునామా.. 'చెన్నై లవ్ స్టోరీ'తో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ హిట్

హృదయాలను తాకే ప్రేమకథ.. గౌరీ ప్రియ నటనకు ప్రశంసలు – మణిశర్మ సంగీతం సినిమాకు అదనపు బలం 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ ప్రేమ, బాధ, ఆశ, కొత్త ఆరంభం... ఈ నాలుగు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథే 'చెన్నై లవ్ స్టోరీ'. దర్శకుడు సాయి రాజేష్ కథకు, నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మాణ విలువలు తోడవడంతో సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంట తెరపై సహజమైన నటనతో ఆకట్టుకుంది. కథలో ఏముంది? ప్రేమలో మోసపోయి జీవితంపై నమ్మకం కోల్పోయిన యువతి జీవితంలోకి ఓ అమాయక యువకుడు అడుగుపెడతాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా...