24 రోజుల నిరాహార దీక్షకు ముగింపు.. కేంద్ర హామీతో సోనమ్ వాంగ్‌చుక్ వెనక్కి!!!!
కేంద్ర మంత్రులతో కీలక భేటీ అనంతరం దీక్ష విరమణ.. విద్యార్థులపై ప్రతీకార చర్యలు ఉండవని హామీ కోరిన వాంగ్‌చుక్ ప్రత్యేక కథనం విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల పారదర్శకత కోసం చేపట్టిన నిరసనలో భాగంగా దాదాపు 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల అక్రమాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పలువురు విద్యార్థులు, యువతపై...