భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు 10 వేల కి.మీ.ల వర్ష మేఘాల విస్తరణ.. భారీ వర్షాలకు ప్రకృతి సంకేతమా?

ఉపగ్రహ చిత్రాల్లో అరుదైన మేఘాల వ్యవస్థ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు వాతావరణ నిపుణుల హెచ్చరిక ప్రత్యేక కథనం భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు దాదాపు 10,000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ వర్ష మేఘాల వ్యవస్థ ఉపగ్రహ చిత్రాల్లో కనిపించడం ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఇంత పొడవైన మేఘాల నిర్మాణం అరుదుగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ మేఘాల బెల్ట్ ప్రభావంతో ఆసియా ఖండంలోని పలు దేశాల్లో రానున్న రోజుల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ మేఘాల వ్యవస్థ భారత్ తూర్పు ప్రాంతాల నుంచి బంగాళాఖాతం...