వడ్రంగి కూతురి నుంచి చంద్రయాన్ టీమ్ వరకు... 14 ఏళ్ల ఆంధ్ర అమ్మాయి జెస్సీ చరిత్ర సృష్టించింది!!!!

ప్రభుత్వ పాఠశాల నుంచి చంద్రుడి మిషన్ వరకు.. ఆంధ్రప్రదేశ్ చిన్నారి జెస్సీ అద్భుత విజయం! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల కందుల జెస్సీ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌సాట్ మిషన్ "మిషన్ శక్తిశాట్ (Mission ShakthiSAT)" కోసం ఎంపికైన భారతీయ విద్యార్థుల్లో ఆమె చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12 వేల మంది బాలికలు పోటీపడగా, భారత్ నుంచి ఎంపికైన 20 మంది విద్యార్థుల్లో జెస్సీ ఒకరు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా ఆమె నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న...