సిజేరియన్లన్నీ ఇక ఆడిట్ పరిధిలోకి వైద్య అవసరముంటేనే.. సిజేరియన్ చేయాలి ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి
పత్రికా ప్రకటన 23-07-2026 అమరావతి సిజేరియన్లన్నీ ఇక ఆడిట్ పరిధిలోకి వైద్య అవసరముంటేనే.. సిజేరియన్ చేయాలి ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆదేశాలు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నిర్వహించే సిజేరియన్ ప్రసవాలు ఇకపై ఆడిట్ పరిధిలోకి రానున్నాయి. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కేసులో సిజేరియన్ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య అధికంగా ఉoడడoపై...