నేతన్నకు భరోసా.. యువతకు ఉద్యోగాల హామీ - రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాల వెల్లడి
అమరావతి, జూలై 23: రాష్ట్రంలో సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 25కు పైగా అంశాలకు ఆమోదం లభించింది. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ 'నేతన్న భరోసా' పథకం కింద బీపీఎల్ చేనేత కుటుంబాలకు చెందిన 50 ఏళ్లలోపు కార్మికులకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. వేలాది కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా రెండో దశలో 3,168 పోస్టుల నియామకాలపై కేబినెట్ చర్చించింది. దీనిపై మరింత అధ్యయనం అనంతరం మంత్రివర్గ ఉపసంఘం...