కన్నీటి నదులుగా మారిన అసోం.. వరద ఉద్ధృతికి బలవుతున్న ప్రాణాలు, నీటిలోనే చిక్కుకున్న లక్షలాది జీవితాలు!

అసోంను ముంచెత్తిన వరదలు.. ఒక్క రోజులోనే 10 మంది మృతి.. 6.5 లక్షల మందికి పైగా ప్రభావితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అసోం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అనేక గ్రామాలు, పట్టణాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గత 24 గంటల్లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 41కు చేరింది. రాష్ట్రంలోని 11 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అధికారుల సమాచారం ప్రకారం 6.53 లక్షల మందికిపైగా ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శివసాగర్ జిల్లా అత్యంత దెబ్బతింది. అక్కడ దాదాపు...