విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలి: ఎన్‌ఎస్‌యూఐ

పీలేరు, జూలై 23 (రాజనీతి): నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాలు జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ కోరారు. పీలేరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు సాయి సంపత్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.