మహిళల భద్రతపై శక్తి టీమ్ అవగాహన సదస్సు
రేణిగుంట, జూలై 23 (రాజనీతి): తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కరకంబాడిలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై శక్తి టీమ్ ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించింది. అదనపు ఎస్పీ శ్రీలత, ఎస్‌ఐ దీపిక విద్యార్థులకు మహిళా సాధికారత, మానవ విలువలు, డిజిటల్ అరెస్ట్, ఏపీకే లింక్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగంతో పాటు సైబర్ హెల్ప్‌లైన్ 1930, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.