రోడ్డు పనుల హామీతో ఆమరణ నిరాహార దీక్ష విరమణ

అన్నమయ్య జిల్లా,పుంగనూరు ,రాజనీతి, జూలై 23, పుంగనూరు పట్టణంలోని ములభాగల్ రోడ్డు మరమ్మతు పనులను ఆదివారంలోపు ప్రారంభిస్తామని (ఆర్&బీ) శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త అయూబ్ అలీ ఖాన్, చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ను విరమించారు. అధికారులు దీక్షా శిబిరానికి వచ్చి పనులు ప్రారంభిస్తామని భరోసా ఇవ్వగా, సీఐ సుబ్బరాయుడు నిమ్మరసం అందించి సామాజిక కార్యకర్త అయూబ్ అలీ ఖాన్, తో దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అధికారులు ఇచ్చిన హామీని నిర్దేశిత గడువులో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొచ్చ నరసింహులు, నాన బాల కుమార్, నాగరాజా, వెంకటరమణ ,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు