రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్‌చెయిన్ 7 జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ భూ మోసాలకు చెక్... వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం అమరావతి, జూలై 22: భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా నిలిచే 'మీభూమి–బ్లాక్ చెయిన్' వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఈ...