మత సామరస్యానికి మహల్ ఉరుసు ఉత్సవాలు ప్రతీక.. భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

మహల్ జూలై 22, 2026 కలికిరి మండలం మహల్ గ్రామంలో హజ్రత్ సయ్యద్ షాహ్ మహమ్మద్ బాషా బుఖారీ ఉరుసు మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. ఈ పవిత్ర ఉత్సవాల్లో పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే దర్గాలో చాదర్ సమర్పించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, రాష్ట్రంలో సామరస్యం నెలకొనాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉరుసు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో...