ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక..! మరో దాడి జరిగితే విధ్వంసమే సమాధానమన్న అమెరికా అధ్యక్షుడు

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు.. ప్రపంచ ఇంధన మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళన వాషింగ్టన్, జూలై 22: మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతోంది. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగితే, అమెరికా కూడా కఠినమైన ప్రతిస్పందన ఇస్తుందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ద్వారా స్పందించిన ట్రంప్, అమెరికా లేదా అంతర్జాతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రతి దాడికి తగిన సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు....