మెగా పీటీఎం–4.0ను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
ఈనెల 24న జిల్లావ్యాప్తంగా జరిగే మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలి జిల్లాలోని 2,259 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకం మదనపల్లె, జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా రెండవ ఏడాది జిల్లాలో 1,92,728 మంది పిల్లలకు సంబంధించి 1,22,076 మంది తల్లులు/సంరక్షకుల ఖాతాలో నేడు 'తల్లికి వందనం నిధులు' జమ కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కారాదని, పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని...