వాల్మీకిపురం తరిగొండ రూ.7.23 కోట్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కిషోర్.

TTD నిధులతో వాల్మీకిపురం, తరిగొండ ఆలయాల స్వరూపం మారుతోంది వాల్మీకిపురం తరిగొండ రూ.7.23 కోట్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కిషోర్. వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లోని ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కూటమి శ్రేణులు, నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాల్మీకిపురం, తరిగొండ ఆలయాలకు రూ.7.23 కోట్లు మంజూరు చేయించారు. వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న దక్షిణ దిశ రాజగోపురం, కోనేటి వీధిలో శ్రీవారి గరుడ పుష్కరిణి ఇందిరమ్మ కాలనీ...