NEET అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి-NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ
NEET అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి - రాహుల్ గాంధీపై పోలీసుల దురుసు వైఖరిని ఖండిస్తున్నాం - NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ పీలేరు, అన్నమయ్య జిల్లా: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ, AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, యువతపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ నేడు పీలేరు అంబేద్కర్ సర్కిల్‌లో NSUI ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NSUI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అడ్డుకోవడం,...