చిన్మయ ఆశ్రమ భూ వివాద పరిష్కారానికి చిత్తూరు ఎమ్మెల్యే చొరవ...

రూ.15 కోట్లతో విద్య, యోగ కేంద్రానికి మార్గం సుగమం.... ఆధ్యాత్మిక కేంద్రంగా ఇరువారం అభివృద్ధికి చర్యలు... చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగర శివారులోని ఇరువారం సమీపంలోని చిన్మయ ఆశ్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ బుధవారం సందర్శించి ఆశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక చర్యలు చేపట్టారు. ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశ్రమ నిర్వాహకులతో సమావేశమై ఆశ్రమ అభివృద్ధి, భూ వివాదం, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆశ్రమానికి సంబంధించిన భూ వివాదం పరిష్కారంపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆశ్రమానికి సంబంధించిన పెండింగ్ భూ...