విద్యార్థుల గళం దేశాన్ని కదిలిస్తోంది..! పార్లమెంట్‌ గడపపై నల్ల దుస్తులతో విపక్షాల హెచ్చరిక!!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీల డిమాండ్ న్యూఢిల్లీ, జూలై 22: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై జరిగిన పోలీసు చర్యల ప్రతిధ్వని పార్లమెంట్‌లోనూ వినిపించింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన పలు విపక్ష పార్టీల ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ మకర్ ద్వారం వద్ద జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, జేఎంఎం తదితర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా తమ సమస్యలను ప్రస్తావిస్తుండగా బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు...