వర్షం వస్తే రైతు ఆనందం.. కానీ ఉప్పు కార్మికుడికి అది కడుపుకొట్టే విపత్తు!
మండే ఎండే జీవనాధారం.. మారుతున్న వాతావరణంతో ఉప్పు కూలీల బతుకులు అగమ్యగోచరం ప్రత్యేక కథనం | 2026 జూలై 22 చాలామందికి వర్షం అంటే చల్లదనం, ఉపశమనం. కానీ ఉప్పు చెరువుల్లో పనిచేసే కార్మికులకు మాత్రం అదే వర్షం వారి జీవనాధారాన్ని దెబ్బతీసే శాపంగా మారుతోంది. మండే ఎండల్లో రోజంతా కష్టపడితేనే ఉప్పు ఉత్పత్తి అవుతుంది. అప్పుడే వారికి కూలి దొరుకుతుంది. ఒక్కసారిగా వర్షం కురిస్తే రోజుల తరబడి ఉప్పు తయారీ నిలిచిపోవడంతో ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. తమిళనాడులోని మరక్కాణం వంటి ఉప్పు ఉత్పత్తి ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల్లో గంటల తరబడి పనిచేయడం...