రోడ్లు బాగు చేసేంత వరకు దీక్ష విరమించను
పుంగనూరు, జూలై 22 (రాజనీతి): అభివృద్ధికి నాంది కావాల్సిన రహదారులు ప్రస్తుతం ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, వాటి మరమ్మతుల కోసం ఓ సామాజికవేత్త ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పుంగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త పి. అయూబ్ ఖాన్ సోమవారం పుంగనూరు–బెంగళూరు ప్రధాన రహదారి దుస్థితిని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రహదారి మరమ్మతు పనులు ప్రారంభించే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పుంగనూరు–బెంగళూరు ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారిందన్నారు. రోడ్డంతా గుంతలమయంగా మారడంతో ప్రతి రోజు చిన్నా పెద్దా ప్రమాదాలు జరుగుతున్నాయని,...