తల్లికి వందనం తో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా..... కుసుమ కుమారి

రేణిగుంట, జూలై 21 (రాజనీతి): విద్యార్థుల విద్యాభివృద్ధి, కుటుంబాల ఆర్థిక భారం తగ్గింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోందని టీడీపీ రేణిగుంట మండల మహిళా అధ్యక్షురాలు కుసుమ కుమారి పేర్కొన్నారు. ఈ పథకం కింద రెండో విడత నిధుల విడుదల విద్యార్థుల విద్యా ప్రగతికి మరింత దోహదపడుతుందన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుసుమ కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే తల్లికి వందనం పథకం రెండో విడత నిధులను విడుదల చేయడం జరిగిందని...