చిన్నారులపై చండీపుర వైరస్ ముప్పు..! గుజరాత్‌లో కలవరపెడుతున్న మరణాలు – అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక

12 పాజిటివ్ కేసులు.. 8 మంది మృతి.. రాజస్థాన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా వైరస్ బారిన పడి మృతి అహ్మదాబాద్, 2026 జూలై 21: దేశంలో మరోసారి చండీపుర వైరస్ (Chandipura Virus - CHPV) ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ వైరస్ కారణంగా గుజరాత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా రాజస్థాన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి గుజరాత్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 63 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 12 మందికి చండీపుర వైరస్ నిర్ధారణ కాగా, 8 మంది...