మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసులు.
చిత్తూరు జిల్లా పోలీసు పత్రికా ప్రకటన తేదీ: 21-07-2026 24 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు ఈ నెల 17-07-2026 న బంగారుపాళ్యం మండలం, అండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఆమెకు సమీప బంధువైన గంగవరం మండలం అరసనపల్లి గ్రామానికి చెందిన హరి @ హరి ప్రసాద్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసాడు. అనంతరం బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు నిన్నటి దినం తెలియజేయగా, బాలిక తల్లి 20-07-2026న రాత్రి సుమారు 8...