మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు-ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు

మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు • ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు • పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి • ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి తరలించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడవి ఏనుగుల బెడదతో దీర్ఘకాలంగా...