మై భారత్ నేషన్ ఛాలెంజ్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వెంకట లోకేష్ కు అభినందన
వీరబల్లి : యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్ పోర్టల్ ద్వారా దేశ నిర్మాణానికి మరియు స్వావలంబనకు దోహదపడేలా రోజువారీ చర్యలను ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త డిజిటల్ ప్రచారమే నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ అని విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాలలో మై భారత్ నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ లో ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో నిలిచిన వెంకట లోకేష్ కు అభినందన సభ నిర్వహించారు.ఈ సందర్బంగా సురేంద్రారెడ్డి మాట్లాడుతు వెంకట లోకేష్ వీరబల్లి ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రధమ సంవత్సరం చదువుతు ఈ పోటీలకు సిద్ధమయ్యాడని ఈ పోటీలకు జాతీయ స్థాయిలో పది లక్షలు...