వెట్టిచాకిరీ చేయించినా.. కార్మికులను అక్రమంగా తరలించినా కఠిన చర్యలు: - అదనపు ఎస్పీ శ్రీ యం.వెంకటాద్రి గారు.
పత్రికా ప్రకటన - తేదీ:21.07.2026 అన్నమయ్య జిల్లా - మదనపల్లి వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మికుల అక్రమ రవాణాపై పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన సదస్సు.. సమాజంలో పీడిత వర్గాల పట్ల జరుగుతున్న వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించే దిశగా అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు, మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 'వెట్టి చాకిరీ (నిర్మూలన) చట్టం - 1976' మరియు 'కార్మికుల అక్రమ రవాణా (ట్రాఫికింగ్ ఫర్ లేబర్)' అనే కీలక అంశాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన...