విద్య కోసం పోరాటం... హక్కుల కోసం నిరసన... కానీ ఎదురైనది టియర్ గ్యాస్‌, లాఠీచార్జ్

న్యూఢిల్లీ, 2026 జూలై 21: విద్యా సంస్కరణల కోసం ఢిల్లీలో కొనసాగుతున్న యువజన ఉద్యమం.. పోలీసు చర్యల తర్వాత కూడా తగ్గని నిరసనలు విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న యువజన ఉద్యమం మరింత ఉధృతమైంది. సోమవారం జరిగిన పోలీసు చర్యల అనంతరం కూడా వేలాది మంది యువత, విద్యార్థులు మంగళవారం మరోసారి జంతర్ మంతర్ వద్ద భారీగా చేరుకుని తమ నిరసనను కొనసాగించారు. పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ...