ఘనంగా హేమచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు.. అన్న క్యాంటీన్‌లో అన్నదానం

పీలేరు, జూలై 21 (రాజనీతి): టీడీపీ యువనేత, ముడుపులవేముల టీడీపీ ఇన్‌చార్జి డా. పల్లవోలు హేమచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా పీలేరు మార్కెట్ ఆవరణలోని అన్న క్యాంటీన్‌లో పేదలకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దలవాయి సురేష్‌కుమార్‌రెడ్డి పాల్గొని అన్నం వడ్డించారు. సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని నిర్వహించడం ఆదర్శనీయమని వారు కొనియాడగా, పలువురు నాయకులు, కార్యకర్తలు హేమచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.