డెంగ్యూపై అప్రమత్తతే రక్షణ..! ఇంటింటికీ లార్వా సర్వేతో ప్రజల్లో అవగాహన

ములకలచెరువు, 2026 జూలై 21: ములకలచెరువు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో కొనేటివారిపల్లెలో ప్రత్యేక డెంగ్యూ అవగాహన కార్యక్రమం డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ములకలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో కొనేటివారిపల్లె గ్రామంలో ప్రత్యేక డెంగ్యూ అవగాహన కార్యక్రమం మరియు లార్వా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించిన ఆరోగ్య సిబ్బంది నీటి నిల్వలు, కూలర్లు, డ్రములు, టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర ప్రాంతాలను పరిశీలించి దోమల లార్వా ఉందా లేదా అనే అంశంపై సర్వే నిర్వహించారు. లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే గ్రామస్తులకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు...