షూటింగ్‌లో బాలయ్యకు స్వల్ప గాయం..! అభిమానుల్లో ఆందోళన – క్షేమంగా ఉన్నారని చిత్రబృందం స్పష్టీకరణ

కాకినాడ, జూలై 21: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడలో జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బాలకృష్ణకు చిన్న గాయం కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. సమాచారం ప్రకారం, యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో జరిగిన చిన్న ప్రమాదంలో బాలకృష్ణకు స్వల్ప గాయమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. వైద్యుల సూచనల మేరకు కొద్దిసేపు షూటింగ్‌కు విరామం ఇచ్చిన చిత్రబృందం, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. గోపీచంద్...