బావిలో దూకిన మహిళను కాపాడిన హెడ్ కానిస్టేబుల్

తిరుపతి, జూలై 21 (రాజనీతి): శ్రీనివాస మంగాపురం సమీపంలో బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను చంద్రగిరి పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె. చలపతి సాహసోపేతంగా రక్షించారు. డయల్–112కు సమాచారం అందిన వెంటనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అప్రమత్తమై పోలీసులను ఘటనాస్థలికి పంపింది. బావిలోకి దూకి మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన చలపతిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఆత్మహత్య పరిష్కారం కాదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–112ను సంప్రదించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.