ఇక ఇంటి పనులన్నీ రోబోట్‌కే..! షావోమీ ‘రోబోటిక్స్-1’తో గృహ జీవితంలో కొత్త విప్లవం

బీజింగ్, 2026 జూలై 21: వంట నుంచి క్లీనింగ్ వరకు.. మనిషిలా నేర్చుకుని పనులు చేసే స్మార్ట్ AI రోబోట్‌ను ఆవిష్కరించిన షావోమీ కృత్రిమ మేధ (AI) రంగంలో మరో భారీ ముందడుగు పడింది. చైనా టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) గృహ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'Xiaomi-Robotics-1' అనే అత్యాధునిక రోబోటిక్ ఫౌండేషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, వస్తువులను సర్దడం, బట్టలు ఉతకడం వంటి అనేక పనులను ఒకే రోబోట్ చేయగల సామర్థ్యంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు చాట్‌జీపీటీ, జెమినీ వంటి AI మోడళ్లు భాష, చిత్రాల రంగంలో విప్లవం సృష్టించగా, ఇప్పుడు అదే...