జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి విలయం..! భారీ వర్షాలకు 23 మంది మృతి.. యాత్రలన్నీ నిలిపివేత

కొండచరియలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలం.. అమర్‌నాథ్ సహా అన్ని ప్రధాన యాత్రలకు బ్రేక్ శ్రీనగర్ / జమ్మూ, జూలై 22: జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పూంచ్, రాజౌరీ, దోడా జిల్లాలు ప్రకృతి విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు నీట మునిగిపోగా, రహదారులు ధ్వంసమై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొండ ప్రాంతాల్లో వరుసగా కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పరిస్థితి విషమంగా...