విద్యార్థినులతో అల్పాహారం చేసిన చిత్తూరు ఎమ్మెల్యే...
బాలికలే భావి భారతానికి బలమైన శక్తి: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్... ఆత్మస్థైర్యంతో చదివి ఉన్నత శిఖరాలు చేరాలి... సంక్షేమ వసతి గృహ విద్యార్థినులకు ప్రభుత్వ మెటీరియల్ పంపిణీ... విద్యతోనే జీవిత లక్ష్యాలు సాధ్యం.. బాలికలకు ప్రోత్సాహం... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): బాలికలు ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, సంక్షేమ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని వల్లియప్పనగర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన షూస్, బెడ్షీట్లు, టవళ్లు, స్వెట్టర్లు,...