*'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్' నూతన వాహనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు *

రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం… గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు....