డెంగ్యూపై భారత్‌కు మహా ఆయుధం..! దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ, 2026 జూలై 21: డీసీజీఐ ఆమోదం.. ప్రాణాంతక వ్యాధి నియంత్రణలో కొత్త అధ్యాయం ప్రారంభం డెంగ్యూ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా డెంగ్యూ నివారణ వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) ఆమోదం లభించింది. జపాన్‌కు చెందిన టకెడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన QDENGA వ్యాక్సిన్‌కు అనుమతి లభించడం దేశ ప్రజారోగ్య రంగంలో చారిత్రాత్మక పరిణామంగా భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి వినియోగించేందుకు అనుమతించారు. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే పరీక్ష అవసరం లేకుండానే ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని నిపుణులు తెలిపారు. ఇది డెంగ్యూ వైరస్‌కు చెందిన నాలుగు...